YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిత్లీ బాధితులకు బాలయ్య ఫాన్స్ విరాళాలు రూ.1,71,346 విరాళాన్ని అందించిన అభిమానులు

తిత్లీ బాధితులకు బాలయ్య ఫాన్స్ విరాళాలు  రూ.1,71,346 విరాళాన్ని అందించిన అభిమానులు
తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం కళాశాల అధ్యాపకుల ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ‘ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్’ నాయకులు సోమవారం మధ్యాహ్నం ప్రజావేదికలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారిని కలిసి చెక్ అందించారు. తిత్లీ తుఫాను తీవ్రతతో తల్లడిల్లిన ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అండగా నేనున్నానంటూ అక్కడే ఉండి సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి రాష్ట్రంలోని అధ్యాపక సమాజం సంపూర్ణ మద్దతు ఇస్తోందని అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని అభినందించారు. 
బాలయ్య అభిమానులు రూ.1,71,346 విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. బాలయ్య అభిమానుల తరుఫున ఈ విరాళాన్ని మన బాలయ్య డాట్ కామ్ నిర్వాహకుడు పుల్లెల గౌతమ్ ముఖ్యమంత్రికి అందించారు. తుపానుతో కష్టాలు పాలైన ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తి సమాజంలోని అన్ని వర్గాలలో కనిపించాలని, బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.  రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీలుగా పనిచేస్తున్న సుమారు వెయ్యిమంది అధ్యాపకుల వేతన సమస్యను పరిష్కరించాలని ఆ సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించారు. అధికారులతో మాట్లాడి గెస్ట్ ఫ్యాకల్టీల వేతన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి చెప్పారు.  వినతులు అందించేందుకు ‘ప్రజావేదిక’కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి వారి వారి సమస్యలు తెలుసుకుని వేళకు భోజనం పెట్టి పంపించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

Related Posts