YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ అత్యుత్సాహం... నెట్ జన్ల పైర్

కాంగ్రెస్ అత్యుత్సాహం... నెట్ జన్ల పైర్

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. హైదరాబాద్ టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. కోహ్లి సేన ఈ రెండు మ్యాచ్‌లనూ మూడు రోజుల్లోనే ముగించింది. హైదరాబాద్‌ టెస్టులో పేసర్ ఉమేశ్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విండీస్‌పై క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లి సేనను అభినందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. కానీ ఆ ట్వీట్లో చేసిన చిన్న తప్పిదం కారణంగా ఆ పార్టీ నవ్వులపాలైంది. తెల్లటి దుస్తుల్లో క్రికెట్ ఆడిన ఫొటో పెట్టి ‘విండీస్‌పై 2-0 తేడాతో సిరీస్ గెలిచిన మెన్ ఇన్ బ్లూకి అభినందనలు’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. జట్టుకు శుభాకాంక్షలు చెప్పే తొందరలో.. మెన్ ఇన్ బ్లూ అనడంతో నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. టెస్టు జట్టును మెన్ ఇన్ బ్లూ అని ఎలా అంటారు..? వన్డే, టీ20ల్లో తలపడే టీమిండియాను మెన్ ఇన్ బ్లూ అంటారు. టెస్టుల్లో ఏ జట్టయినా ధరించేది తెల్లటి వస్త్రాలే కదా? అని క్రికెట్ ప్రేమికులు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ వర్ణ అంధత్వానికి రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని పంచ్‌లేస్తున్నారు. డియర్ రాహుల్ గాంధీ టెస్టు మ్యాచ్‌లను వైట్ యూనిఫాంలో ఆడుతారని కాంగ్రెస్ చీఫ్‌ను ట్యాగ్ చేసి ట్వీట్లు చేస్తున్నారు.

Related Posts