YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఐసీసీ ర్యాంకింగ్స్ లో షా , పంత్ ....

ఐసీసీ ర్యాంకింగ్స్ లో షా , పంత్ ....

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత యువ క్రికెటర్లు పృథ్వీ షా‌‌, రిషబ్ పంత్‌ దూకుడు కొనసాగించారు. వెస్టిండీస్‌పై ఆదివారం ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న ఈ ఇద్దరు హిట్లర్లు.. సోమవారం ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ పోటీపడ్డారు. వెస్టిండీస్‌తో రాజ్‌కోట్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 18 ఏళ్ల పృథ్వీ షా శతకం బాదగా.. 92 పరుగుల వద్ద రిషబ్ పంత్ ఔటై సెంచరీని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌ల్లో 70, 33 పరుగులు చేశాడు. ఈ టెస్టులోనూ 21 ఏళ్ల రిషబ్ పంత్ మరోసారి సరిగ్గా 92 పరుగుల వద్దే ఔటై శతకాన్ని మిస్‌ చేసుకున్నాడు. రాజ్‌కోట్ టెస్టులో శతకంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 73వ స్థానంతో తన ప్రస్థానాన్ని మొదలెట్టిన పృథ్వీ షా.. ఉప్పల్ టెస్టులో మొత్తం 103 పరుగులు చేయడం ద్వారా 13 స్థానాలు ఎగబాకి 60వ స్థానంలో నిలిచాడు. మరోవైపు.. రిషబ్ పంత్ 111వ స్థానం నుంచి ఏకంగా 49 స్థానాలు ఎగబాకి 62వ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో.. ఉప్పల్ టెస్టులో 10 వికెట్లు పడగొట్టిన ఉమేశ్ యాదవ్ నాలుగు స్థానాలు ఎగబాకి 25వ స్థానానికి చేరుకున్నాడు.

Related Posts