YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

అక్టోబరు 16 నుంచి 21 ఎస్ బీఐ ఆపర్లు..

అక్టోబరు 16 నుంచి 21  ఎస్ బీఐ ఆపర్లు..

స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా.. ఎస్‌బీఐ డిజిటల్ వేదిక 'యోనో (యూ ఓన్లీ నీడ్‌ వన్‌)' ద్వారా షాపింగ్ చేసినవారికి అదనపు రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. 'యోనో' ద్వారా 85కు పైగా ఈ-కామర్స్ సంస్థల్లో షాపింగ్ చేయవచ్చు.పెట్టుబడులు, సెక్యూరిటీలకూ వెళ్లవచ్చు. డిజిటల్‌ షాపింగ్‌ వేడుకను అందిస్తున్న తొలి బ్యాంకు ఎస్‌బీఐ కావడం విశేషం. అంతేగాక ఇది పేపర్‌లెస్ బ్యాంకింగ్‌కు పెద్ద ఎత్తున ఊతమివ్వగలదని ఎస్‌బీఐ భావిస్తోంది. అక్టోబరు 16 నుంచి 21 మధ్య ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగిస్తూ షాపింగ్ చేసే కస్టమర్లకు క్యాష్ బ్యాక్, 10 శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.  14 ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్యాషన్ నుంచి ఫర్నీచర్‌దాకా కొనుగోళ్లపై 50 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నాయి.  అమెజాన్, జబాంగ్, మింత్రా, కల్యాణ్ క్యారెట్‌లేన్, పీసీజే, పెప్పర్‌ఫ్రై, ఓయో, టాటా క్లిక్, యాత్రా, ఈజ్‌మైట్రిప్, ఫస్ట్‌క్రై, ఐజీపీ, ఫెర్న్స్ అండ్ పెటల్స్ వంటి సంస్థలు యోనో షాపింగ్ ఫెస్టివల్‌లో భాగంగా కొనుగోళ్లపై ఎస్‌బీఐ ఖాతాదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాల్ని అందించనున్నాయి.  ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గిఫ్ట్, జ్యుయెల్లరీ, ఫర్నీచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ తదితర కొనుగోళ్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లభించనున్నాయి. యోనో యాప్‌ను 2017 నవంబర్‌లో ఎస్‌బీఐ ప్రారంభించింది. ఇప్పటికే 30 లక్షల కస్టమర్లు యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. రోజూ కొత్తగా దాదాపు 25 వేల ఖాతాదారులు దీనిపైకి వస్తున్నారని గుప్తా ఈ సందర్భంగా తెలిపారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆధారిత మొబైల్ ఫోన్ల ద్వారా యోనో యాప్‌లోకి వెళ్లవచ్చు. 

Related Posts