YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉప్పెనలా తరలివచ్చిన జనసైనికులు

ఉప్పెనలా తరలివచ్చిన జనసైనికులు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘జనసేన కవాతు’ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకల లంక నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం వరకు కవాతు కొనసాగుతోంది. జనసైనికులు, అభిమానుల మధ్య కారులోనే పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. జనసేనాని పిలుపు మేరకు జనసైనికులు ఉప్పెనలా తరలివచ్చారు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్షలాది జనసైనికుల మధ్య పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్‌తో కాటన్ విగ్రహం వద్ద సభా ప్రాంగణానికి వెళ్తున్నారు. తెల్లని పంచ, పైజమా ధరించిన పవన్.. కారుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ జనసేన జెండాలతో నిండిపోయింది. ఇక కాటన్ విగ్రహం వద్ద సభా వేదికపై ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలు, డప్పు వాయిద్యాలతో అలరిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణం వద్దకు చేరుకోనున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కాగా, సభా వేదికపై జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయాలు రావాలంటే జనసేన అధికారంలోకి రావాలని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పలు ఆరోపణలు చేశారు. ‘21 లక్షల మంది జనసేన కార్యకర్తల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేయించుకోవాలి. అలాగే జనసేన సభ్యత్వం తీసుకోవాలి. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా జనసేన మేనిఫెస్టో ఉంటుంది. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. రైతు రుణాలను మాఫీ చేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నో హామీలను తుంగలో తొక్కాయి. అందుకే జనం వద్దకు వెళ్లి జనబాట కార్యక్రమం ద్వారా ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తున్నాం. జనబాట కార్యక్రమాన్ని మీరంతా విజయంతం చేయాలి’ అని తోట చంద్రశేఖర్ జనసైనికులకు పిలుపునిచ్చారు. జనసేన అధికారంలోకి రావాలని, పవన్ కళ్యాణ్‌ను సీఎంను చేయాలని ఆయన కోరారు. 

Related Posts