YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చమురు సంస్థల సీఈవోలు, నిపుణులతో ప్రధాని మోదీ భేటీ

చమురు సంస్థల సీఈవోలు, నిపుణులతో ప్రధాని మోదీ భేటీ

చమురు సంస్థలకు చెందిన సీఈవోలు, నిపుణులతో సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత్‌తో పాటు విదేశీ ఇంధన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రదాని మాట్లాడుతూ ఇంధనం ఉత్పత్తి చేస్తున్న దేశాలపైనే ఆయిల్ మార్కెట్ ఆధారపడి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఇంధన ధరలను కూడా ఆయిల్ ఉత్తత్తి చేస్తున్న దేశాలే నిర్దేశిస్తాయన్నారు. వాస్తవానికి కావాల్సినంత ఇంధనం ఉన్నా.. ఆ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలు అనుసరిస్తున్న మార్కెట్ వ్యూహాల వల్లే ఆయిల్ ధరలు పెరిగినట్లు మోదీ అభిప్రాయపడ్డారు. చమురు ధరలు పెరగడం వల్ల ఆ ఇంధనంపై ఆధారపడే దేశాలకు తీవ్ర ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ వాణిజ్య అన్వేషణ ప్రారంభించాల‌ని మోదీ అన్నారు.సదస్సులో పాల్గొన్న ఆయిల్ కంపెనీల సీఈవోలు.. ప్రధాని మోదీ గత నాలుగేళ్లలో తీసుకున్న నిర్ణయాలను స్వాగతించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను వాళ్లు మెచ్చుకున్నారు. ఎనర్జీ రంగంలో భారత్ చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమన్నారు. పెట్టుబడి కోణంలో భారత్ ర్యాంక్ మెరుగైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఓ పరిశ్రమగా ఎదిగిందని, ఇంధన ప్రపంచ వాణిజ్య వస్తువుగా మారిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. పటిష్టమైన ఇంధన భవిష్యత్తు కోసం చమురు ఉత్పత్తి దేశాలతో సత్సంబంధాలను ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Related Posts