కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం దాటియాలో మా పీతాంబర ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. గ్వాలియర్ నుంచి ఆయన హెలికాప్టర్‌లో దాటియా చేరుకున్నారు. పీతాంబర శక్తిపీఠంలో ఆయన సుమారు గంటన్నర సేపు గడిపారు. ఆ రాష్ర్టా పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్‌తో పాటు మరో నేత జ్యోతిరాథిత్య సింథియా ఆయనతోనే ఉన్నారు. 1979లోనూ ఇంధిరా గాంధీ ఈ ఆలయాన్ని విజిట్ చేశారు. 1984లో ప్రధాని అయిన తర్వాత రాజీవ్ గాంధీ కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. పీతాంబర ఆలయ ట్రస్టు చైర్మన్‌గా ప్రస్తుతం రాజస్థాన్ సీఎం వసుంధారా రాజే కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్28వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.