కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలను పెంచుతుండటంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై వేయి కోట్ల రూపాయల మేరకు భారం పడనుంది. డీజిల్ ధరలు పెరుగుతుండటం వల్ల సంస్థపై వేయి కోట్ల రూపాయలకు పైగా భారం పడిందని, సిబ్బంది వేతన సవరణతో మరో 750 కోట్ల రూపాయల భారం పడింది. 2015 నుండి ఇప్పటివరకు ఆర్టీసీ ప్రయాణ చార్జీలను పెంచలేదు. ప్రయాణికులపై ఏమాత్రం భారం పడకుండా ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారించామని ఎండీ సురేంద్రనాధ్ చెప్పారు. సంస్థ నూతనంగా 80 ఇంద్ర బస్సులు కొనుగోలు చేస్తోందని, వీటిని వివిధ డిపోల్లోని పాత బస్సుల స్థానంలో నడుపుతామన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సు సర్వీసులు నడుపుతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సర్వీసులు 3.50 లక్షల కిలోమీటర్లు, ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ సర్వీసులు 2.50 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయని తెలిపారు.