YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

దూసుకెళ్తున్న అరవింద సమేత

 దూసుకెళ్తున్న అరవింద సమేత
మాటల మాత్రికుడు త్రివిక్రమ్-యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు కాంబినేషన్‌లో హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో వచ్చిన చిత్రం ‘అరవింద సమేత.. వీరరాఘవ’. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 11న ఈ చిత్ర ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ‘అరవింద సమేత.. వీరరాఘవ’ అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజులకే వంద కోట్ల గ్రాస్ సంపాదించింది. అంతేకాదు, ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. ‘టెంపర్’ నుంచి మొదలుకుని ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవ కుశ’ వంటి బ్లాక్‌బాస్టర్ సినిమాలతో పలు రికార్డులు క్రియేట్ చేసిన నందమూరి తారక రాముడు.. తాజా సినిమాతో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా దక్షిణ భారతదేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి హీరోగా చరిత్ర సృష్టించాడు.వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి పాలోయింగ్ పెంచుకున్నాడు. దీంతో అతడి సినిమాలకు క్రమంగా మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడిదే రికార్డు సృష్టించడానికి కారణం అయింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అరవింద సమేత ఓవర్సీస్‌లో ఇప్పటికే 2 మిలియన్ వసూళ్లకు చేరువలో ఉంది. అయితే, తారక్ గత చిత్రాలు ‘నాన్న‌కు ప్రేమ‌తో’, ‘జ‌నతా గ్యారేజ్‌’, ‘జై ల‌వ‌ కుశ‌’ కూడా ఓవ‌ర్సీస్‌లో 1.5 మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్ల‌ను అందుకున్నాయి. అంటే వరుసగా నాలుగు సినిమాలు ఈ రేర్ ఫీట్‌ను సాధించాయి. ఇలా వరుసగా నాలుగు సినిమాలు 1.5 మిలియన్ మార్కును చేరుకోవడం తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోనే మొదటిసారి. అంటే ఎన్టీఆర్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిపోతుందో స్పష్టమవుతోంది. 18వ తేదీ వరకు మరో సినిమా విడుదల అవడంలేదు కాబట్టి ‘అరవింద’కు కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. చినబాబు నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా.. జగపతిబాబు, ఇషారెబ్బా, సునీల్, నాగబాబు, నవీన్ చంద్ర, దేవయాని, శుభలేఖ సుధాకర్, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించాడు

Related Posts