YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ రామదూత సమూహం

 శ్రీ రామదూత సమూహం

  *ఓం హ్రీం కాలాభ్రాభాం*
*కటాక్షైరరికులభయదాం మౌలిబద్దేందురేఖాం*
*శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి*
*కరైరుద్వహంతీం త్రినేతామ్|*
*సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం*
*తేజసా పూరయంతీం*
*ధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం*
*త్రిదశపరివృతాం సేవితాం సిద్దికామైః||*
 
  అమ్మ‌ వైభవ స్తుతి, శక్తివంతమైన శ్రీ *మహిషాసురమర్ధిని స్తోత్రం*  - భావము.           *శ్లోకము - 19*
 
శ్లోకము:
*కనకలసత్ కలశాబ్ది జలై  రనుసించినుతే గుణరంగభువం*
*భజతిసకిం నశచాకుచ కుంభతటీ పరిరంభసుఖం*
*తవచరణం శరణం కరవాణి నతామరవాణి నివాసిశివే*
*జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే*
 
*భావము:*
అనుదినమూ బంగారు పాత్రలతో నీరు తెచ్చి నీకు అభిషేకము చేస్తుండే భక్తుడు దేవేంద్రపదవిని పొందగలడు.నీకు నిత్యము మొక్కే దేవతల వాక్కులయందు నీవు నివసిస్తూఉండేదానవు.మహిషాసురున్ని మర్ధించినదానా!  ఓ తల్లీ నీకు జయమగుగాక!!
ఈ శైలరాజసుత పార్వతీదేవియే ఇంద్రునివంటి ఐశ్వర్యములనిచ్చే లక్ష్మీస్వరూపము. విద్యలనొసంగే సరస్వతీ స్వరూపము.కనుకనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసస్వతి అని ఒకే దేవిలో త్రిమాతలను పూజుస్తాము. లలితాసహస్రనామాలలో  మహాలక్ష్మి, సరస్వతి నామాలు ఉంటాయికదా!! క‌నుక మాకు ఐశ్వర్యము, విద్యా,శక్తులకు నిన్నే శరణువేడుతున్నాము.
*మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా మహాబుద్దిర్మహాసిద్దిర్మహా యోగేశ్వరేశ్వరి* అని లలితాసహస్రనామాలతో ఐశ్వర్యానికి,బలానికి, బుద్దికి, వీర్యానికి, సిద్దికి అన్నిటికీ అధిదేవత ఆ యోగీశ్వరేశ్వరే! ఆ మహిషాసురమర్ధిని! రమ్యకపర్ధినియే!! జయము తల్లీ నీకు జయము!!

  *తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ*

  *సర్వేజనా సుఃఖినోభవంతు*

  *శరన్నవరాత్రులలొ అమ్మ ఈరోజు అవతారం శ్రీమహాలక్ష్మీ దేవి*

*లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం*
*దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం*
*శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్‌ బ్రహ్మేంద్ర గంగాధరాం*
*త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం*

నవరాత్రుల్లో విశేషంగా ఈరోజు అమ్మ మహాలక్ష్మి అమ్మవారుగా దర్శనమిస్తుంది.
ఈరోజు అమ్మను ఈ రూపంలో కొలవడం వల్ల అన్ని రకాలైన సంపదలు లభిస్తాయి. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి...మొదలైన      ఎనిమిది రూపాల్లో ఉన్న అష్టలక్ష్ములను కొలిచిన ఫలితం లభిస్తుంది.

శుద్ధ సత్త్వ స్వరూపిణి. సర్వసంపదల రూపిణి. సంపదలకు అధిష్ఠాత్రి. సుశీల. లోభ మోహ రోష మద అహంకారాదులు లేని నిర్మలమైన క్షమాస్వరూపిణి. సర్వ సస్యాత్మిక. భూతకోటి కి  జీవనోపాయ రూపిణి. వైకుంఠ వాసియైన నారాయణుని భార్య. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యంలో రాజ్యలక్ష్మిగా, భూలోకంలో భూలక్ష్మిగా, మన గృహాలలో గృహలక్ష్మిగా ఉండే తల్లి. ఈ అమ్మ దయ వల్లనే సంపదలు లభిస్తాయి. సత్కర్మలు, శుచి, శుభ్రత, సదాచారం ఉన్నచోట, ఉన్న ఇంట కొలువై ఇహపరాలను అందిస్తుంది మహాలక్ష్మి. పద్మంపై, పద్మహస్తయై, వరదాభయాలను ఇచ్చే స్వర్ణ విగ్రహరూపిణి మహాలక్ష్మి.

దుష్కర్మపరులైన, దురాచార పరాయణులైన వారింట దుఃఖకటారిణి అయిన జ్యేష్టాదేవి రూపం కూడా ఈ అమ్మదే. మన కర్మల ఫలాన్ని ఇచ్చే తల్లిగా ఈ రూపం. వెలుగూ, చీకటీ కూడా ఈమహాశక్తి రూపాలే.

లక్ష్ములు అనగా శుభ లక్షణాలు అని అర్థం. లక్ష్ములు ఉన్నచోట ఉండేది లక్ష్మి. భౌతికంగా మానసికంగా ఎప్పుడూ శుభంగా ఉండడం అనేది దాని నుంచే మనం నేర్చుకోవాలి. శుద్ధలక్ష్మి, మోక్ష లక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, అనే రూపాలు ఎన్ని ఉన్నప్పటి కీ ఇవన్నీ అంతర్గతమైన కనిపింపని రూపాలే. ధైర్యం కనిపించదు, ఆరోగ్యం కనిపించదు, అది లేనప్పుడు మాత్రం తెలుస్తుంది. ఏవైతే కనిపించకుండా ఉండి కనిపించే శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయో వాటినే సంపదలు అంటారు. అవే అష్ట లక్ష్ములుగా కొలవబడుతున్నాయి.

ఈ సంపదలను పొందటమే సంపాదన అవుతుంది. కనిపించేదానికన్నా కనిపించనిది శక్తివంతమైనది. మనస్సులో శుభలక్షణాలు ఉన్నవానికి  లక్ష్మీదేవి ఉంటుంది. దేహానికి  శుభ్రత, మనస్సుకు శుద్ధమైన ఆలోచనలు ఇవే లక్ష్మీ స్వరూపాలౌతాయి. దాని ద్వారా వ్యక్తి శాశ్వతత్వాన్ని పొందుతాడు. కేవలం ధనము అనేటటువంటిది రూపసంపదకు సంకేతంగా ఉంటుంది. రూప సంపదకన్నా గుణ సంపద విశిష్టమైనది. రూప సంపద తాత్కాలిక అవసరాలను తీరిస్తే, గుణ సంపద వ్యక్తిని ఆనందమయుణ్ణి చేసి శాశ్వతత్వాన్ని చేకూరుస్తుంది. సూర్యుడు ఉదయించినపుడు పద్మం వికసిస్తుంది. భగవంతుని అనుగ్రహం వల్ల కలిగిలే వ్యక్తి వికసత్వం కూడా ఈ పద్మం లాటిదే. అందుకే అమ్మవారిని పద్మ స్వరూపగా, పద్మాక్షిగ, పద్మస్థితగా, పద్మహస్తగా, పద్మ ప్రియగా, పద్మినిగా, పద్మాలయగా భావించి  కొలిచే సంప్రదాయం ఏర్పడింది. ఏ అమ్మ మనదగ్గర ఉంటే అన్ని శక్తులు (లౌకిక పారలౌకిక శక్తులు) మన శక్తులుగా మారతాయో ఆ శక్తులకు ప్రతీకయే మహాలక్ష్మి. ప్రకృతిలో కనిపించే కనిపించని శక్తులన్నికీ సంకేతం. ఈ నవరాత్రుల సందర్భంలో

Related Posts