- కేటీఆర్ మాటల తీరు జగుప్సాకరం
- సీఎల్పీ నేత జానారెడ్డి
- కేటీఆర్‌పై మండిపడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు
కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన లోఫర్ వ్యాఖ్యలు చిచ్చును రాజేశాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంతా వరుసబెట్టి కేటీఆర్‌పై మండిపడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులు జానారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకులు జె. గీతారెడ్డి, టి.జీవన్ రెడ్డి, ఎస్.ఎ. సంపత్ కుమార్, సిఎల్పీ కార్యదర్శి టి. రామ్మోహన్ రెడ్డిలతో కలిసి మాట్లాడారు . కేటీఆర్ మాటలు, తీరు జగుప్సాకరంగా ఉందని ఆక్షేపించారు. టీఆర్‌ఎస్ తీరు మారటం లేదు... కేటీఆర్ వాడిన పదజాలాన్ని సీఎల్పీ నేతగా నేను ఖండిస్తున్నా. ఇది రాజకీయ అహం, దిగజారుడు తనానికి నిదర్శనం. ఎదుటి వారిని చులకన చేస్తే వారు ఉన్నతం అనుకోవడం మంచిది కాదు. ఏహ్యమైన మాటలు వారికి అలవాటుగా మారాయి. రాజకీయాల్లో సంస్కారం, వ్యవహార తీరును ప్రతీసారి నేను గుర్తు చేస్తూనే ఉన్నాను. రోజూ నా చుట్టు తిరిగినోళ్లు .. సీఎం లు, మంత్రులు అయ్యారని చులకన చూస్తాన్నానా? లేదుకదా!. వారి హోదాకు కూడా గౌరవం ఇస్తున్నా. అలాగే అధికార పార్టీ నేతలకు కూడా మొదటి నుంచి సభ్యతతో మెదగాలని చెబుతున్నా. కానీ, వారి తీరు ఎంత మాత్రం మారటం లేదని జానారెడ్డి తెలిపారు.ఎదుటి వారిని చులకన చేస్తే వారు ఉన్నతం అనుకోవడం మంచిది కాదు..ఏహ్యమైన మాటలు వారి అలవాటు గా ఉంది..రాజకీయాల్లో సంస్కారం , వ్యవహార తీరు ను ప్రతీ సారి గుర్తు చేస్తాను..కెసిఆర్ మాట్లాడిన, తెరాస వారు మాట్లాడినా, మా వాళ్ళు మాట్లాడిన వద్దని సలహా ఇచ్చాను..వద్దని హుందాగా, సంయమనం తో ఉండాలని, వాస్తవానికి తగ్గట్టు మర్యాదగా, పద్దతి గా ఉండాలని, వచ్చే తరానికి తెలిసే గా ఉండాలని చెప్పాను..ఇలాంటి మాటల వల్ల సభ్యతా, సంస్కారం నాశనమై.. రాజకీయ విలువలు దిగజారుతాయి.. అవ్వే మాట్లాడాలంటే.. మేమూ మాట్లాడగలం... కాంగ్రెస్ లోఫర్ అంటే... తెరాస.. బ్రోకర్ పార్టీ అని ఎవరన్నా అంటే.. ఏం చెప్పగలం.. మీడియాలో పడటం కోసం ఆర్భాటం.కాలి గోరు తో పోల్చితే... కాళ్ళు పట్టుకున్న దాన్ని ఏమనాలి ?తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల కనీసం గౌరవం ఇవ్వకపోవడం ప్రజలను బాధిస్తుంది.. ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారువాళ్ల పనుల్లో గొప్ప చూపించుకోవాలి.. అలాంటి కుసంస్కృతి చూపించే వారు రాజకీయాలకు తగరని ప్రజలు తీర్పు ఇస్తారు130 కోట్ల ప్రజల పార్టీ కి రాహుల్ నాయకుడు.. ప్రధాని అవ్వడానికి అవకాశం ఉన్నా వదిలేసిన నాయకుడుగుజరాత్ లో మోడీని మూడు చెరువుల నీళ్లు తాగించారు.. పప్పు కాదు పిప్పి పిప్పి చేసిన రాహుల్రోజూ నా సుట్టు తిరిగినోళ్లు .. సీఎం లు, మంత్రులు అయ్యారని చులకన చూస్తాన? వారి హోదాకు గౌరవం ఇవ్వాలి కదా.సవాల్ చేసినవారికి.. మా పార్టీ నాయకుడు .. ఇప్పటికే సమాదానం ఇచ్చారు..2019 లో కాంగ్రెస్ అధికారం లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.ఎవరెవరు ఏం సవాల్ వేసుకున్నా కూడా.. ప్రజలు మాత్రం మాకు అధికారం ఇస్తారు...ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. తెలంగాణ ఏర్పాటు ను మోదీ అవమానిస్తే తెరాస ఎంపీ లు నోతికి బట్ట కట్టుకొని కుచున్నారు..సీబీఐ కి భయపడి కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు..ఎక్కడ నీ ఉద్యమ స్ఫూర్తి...జై తెలంగాణ నుండి జై ఆంధ్రా అయింది..కేటీఆర్ ఇలాంటి పదజాలం వాడటం విద్యావంతుడి గా నీకు తగునా..దేశాలు తిరిగి ఇదేనా నేర్చుకున్నావ్..తెలంగాణ ఇచ్చిన దేవత అని మీ నాన్న సోనియా దగ్గర మోకారిల్లారు.. మీ పిల్లలు కూడా ఉన్నారు..ఆ రోజు పప్పూ అనిపించే అక్కడికి వెళ్ళినవా ఆ రోజు..రాహుల్ గాంధీ మీద మాట్లాడే అర్హత నీకు లేదు..గుజరాత్ లో మోదీ ని రాహుల్ గడగడలాడించాడు. టి. రామ్మోహన్ రెడ్డి mla.. గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రాజీవ్ఆరోగ్య శ్రీ వంటి పలు ప్రజా సంక్షేమ పథకాలను కాపీ కొట్టి మారు పేరుతో మోడీ ప్రభుత్వం అమలుకు శ్రీకారం చుడుతోందే తప్ప ప్రజాలకంటూ బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమి లేదు... రాష్ట్రంలోని ప్రభుత్వం కూడా అదే త్రోవలో నడుస్తోంది...ఇటువంటి ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీని మరియు రాహుల్ గాంధీని విమర్శించడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ పై అవాకులు చెవాకులు మానుకోవాలని మరియు బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నాను..లేనిపక్షంలో ఆ ఇరు పార్టీలు ప్రజల యొక్క తీవ్ర అగ్రహనికి గురికాక తప్పదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంతా హెచ్చరించారు.