మంగళవారం నాడు మందస మండలంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మండలంలో విద్యుత్ పునరుద్ధరణ కోసం జరుగుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఐదు వేల విద్యుత్ స్తంభాలు పూర్తిగా పడిపోయాయి. వాటి స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నాం అనిఅధికారులు వివరించారు. ఏదైనా చేయండి.
మధ్యాహ్నం లోపు విద్యుత్ ను పునరుద్దరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మందస మండలంలో ఉన్న 38 గ్రామాలు,244 నివాస ప్రాంతాలకు ఎప్పటి లోగా విద్యుత్ పునరుద్ధరణ చేస్తారో రిపోర్ట్ ఇవ్వాలని అన్నారు. అర్ధరాత్రి 4 గంటల సమయంలో మందస మండల కేంద్రంలో విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. మంగళవారం ఉదయం 9 గంటలకు మిగిలిన ప్రాంతాల్లో మరమ్మతుల కోసం, ప్రమాదం నివారణ చర్యగా విద్యుత్ నిలిపివేసామని అధికారులు వివరించారు. పారిశుధ్య నిర్వహణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
తరువాత, స్థానిక డిఆర్డిఏ వెలుగు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా,హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. 244 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిరంతరం గా కొనసాగాలి. ఈ రోజు అదనంగా 14 ట్యాంకర్లు, మరికొన్ని అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. వాటిని సమర్థవంతంగా వినియోగించుకొని ప్రతీ గ్రామానికి నీరు అందించాలని మంత్రి సూచించారు. మందస మండలంలో సుమారుగా 5 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి అని అంచనా. గిరిజన తాండాల్లో ఎక్కువ శాతం ఇళ్లు పడిపోయాయి. నష్టపరిహారం అంచనా జాగ్రత్తగా చెయ్యాలి. బుధవారం సాయంత్రం లోపు నష్ట పరిహారం అంచనా పూర్తి అవ్వాలని అన్నారు. అంచనా లో ఎలాంటి తప్పులు చెయ్యకుండా గ్రామస్తులతో మాట్లాడి అన్ని పక్కాగా చూసుకున్న తరువాత లెక్కలు రాయాలని అన్నారు.