ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీమహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనంమిచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే శ్రీమహాలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. రాత్రి 11 గంటల వరకు శ్రీమహాలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శనానికి అనుమతి చ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.