మీటూ’ చీకటికోణాలు ఒక్కొక్కటిగా బాలీవుడ్‌ని కమ్మేస్తున్నాయి. చిత్ర సీమలో చిరుదివ్వై విరజిమ్మాలనుకున్న ఎంతో మంది హీరోయిన్స్, సింగర్స్, మహిళా ఆర్టిస్టులు కామపు కోరలకు బాధితులవుతున్నారు. ఇన్నాళ్లూ మగ అహంకారం వాళ్ల గొంతునొక్కేసినా ‘మీటూ’ ఉద్యమ స్పూర్తితో ఒక్కో గొంతూ స్వరం పెంచుతోంది. పరిశ్రమకు చెందిన ఒక్కో రసికరాజు గుట్టుని బయటకు లాగుతుంది. కృతిక, సిమ్రన్, చిన్మయి, సునితా సారథి, ఆశాశైనీ, నిషితా జైన్, తను శ్రీ దత్తా ఇలా ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బాహాటంగా వెళ్లడించి ఉద్యమానికి ఊపునిచ్చారు. తాజాగా ఈ ఉద్యమ స్పూర్తితో మరో సింగర్ వర్షాసింగ్ దనోహ గాయకుడు కైలాష్ ఖేర్ తనతో గడపాలని కోరాడంతో తనకు ఎదురైన లైంగిక వేధింపుల్ని వీడియో రూపంలో బయటపెట్టింది. ఇప్పటికే సింగర్ సోనా మహాపాత్ర ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా... తాజాగా వర్షా సింగ్ ధనూవ అనే గాయని కైలాష్ ఖేర్ కామ కోరికల చిట్టాను బయటపెట్టింది. ‘కైలాష్ ఖేర్ నాకు ఫోన్ చేశాడు.. మొదట్లో కలవాలన్నాడు. ఆ తర్వాత నీతో గడపాలని ఉందని అన్నాడు. అతని ఉద్దేశం నాకు అర్ధమైంది’ అని అన్నారు. ఈ సందర్భంగా అతనికి భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మ శ్రీ అవార్డ్‌లను వెనక్కితీసుకోవాలని కోరారు వర్షా సింగ్. తెలుగులో కైలాష్ ఖేర్.. పండగలా దిగివచ్చావూ (మిర్చి), వచ్చాడయ్యో సారి ( భరత్ అనే నేను), ఏడ పోయినాడో ( అరవింద సమేత) మొదలైన సాంగ్స్‌తో పాపులర్ అయ్యారు. ఇక హిందీలో టాప్ సింగర్‌గా తెలుగుతో పాటు, గుజరాతీ, నేపాలీ, తమిళ్, మలయళం, కన్నడ, బెంగాళీ, ఒడియా, ఉర్దూ భాషల్లో అనేక పాటలు పాడారు కైలాష్ ఖేర్. ఇక ఈయనతో పాటు మరో గాయకుడు తోషి సబ్రి సైతం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మరో బాంబ్ పేల్చింది వర్షా. వృత్తిపరంగా సింగర్ సబ్రితో పనిచేయాల్సి వచ్చిందని.. ఓ రోజు సాంగ్ రికార్డింగ్ కోసం కారులో వెళ్తుంటే మీద చేయివేసి అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. అంతేకాకుండా తనను మద్యం తాగాలని బలవంతం చేశాడని తీషి సబ్రిపై సంచలన ఆరోపణలు చేసింది వర్షా సింగ్.