ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీని మరింత బలోపేతం చేసే దశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న న తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో చేపట్టిన ‘జనసేన కవాతు’కు భారీ స్పందన లభించింది. వేలాదిగా జనసైనికులు ఈ కవాతులో పాల్గొని అధికార, ప్రతిపక్షపార్టీలకు గట్టి సంకేతాలను పంపారు. పిచ్చుకలంక విచ్చేసిన పవన్ కళ్యాణ్ భారీగా తరలివచ్చిన జనసైనికులకు అభివాదం చేసి కవాతును ప్రారంభించారు. సుమారు మూడు గంటల పాటు ఈ కవాతు సాగింది. పవన్ కళ్యాణ్‌కు కడియం నర్సరీ రైతులు వినూత్నంగా స్వాగతం పలికారు. పారాగ్లైడర్ సాయంతో నింగి నుంచి రైతులు పూలు చల్లడం ఆకట్టుకుంది. వేలాదిగా అభిమానులు, పార్టీకార్యకర్తలు హాజరుకావడంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నందున పవన్ కళ్యాణ్ కారులో నుండే ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తోపులాట స్వల్ప తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. గంగపుత్రులు వందలాది పడవలపై బ్రిడ్జికి ఇరువైపులా జనసేన జెండాలను గోదావరిపై రెపరెపలాడించారు. వేలాదిగా అభిమానులు, పార్టీకార్యకర్తలు హాజరుకావడంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నందున పవన్ కళ్యాణ్ కారులో నుండే ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తోపులాట స్వల్ప తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం వరకు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా నిర్వహించిన కవాతు అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం ద్వారా జనసైనికుల్లో ఉత్సాహం నింపారు. జనసేన సభావేదికపై జబర్ధస్త్ ఫేం హైపర్ ఆది ప్రసంగం ఆకట్టుకుంది. తనదైన శైలిలో ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పవన్‌తో పాటు ఇటీవల పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్‌తో పాటు, జనసేన తొలి అసెంబ్లీ అభ్యర్థి ముమ్ముడివారానికి చెందిన పితాని బాలక్రిష్ణ, ఎం.రాఘవయ్య, కందుల దుర్గేష్, శెట్టిబత్తుల రాజబాబు, పంతం నానాజీ, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.