న్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్‌ను జేడీయూ ఉపాధ్యక్షుడిగా నితీశ్ కుమార్ నియమించారు. నితీశ్ నిర్ణయంతో పార్టీలో ప్రశాంత్ కిశోర్ రెండో శక్తివంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్.. తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ఆయనకు నితీశ్ కుమార్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. పంజాబ్, యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికలకు వ్యూహరచన చేశారు. పంజాబ్‌లో ఆప్‌ను తోసిరాజని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఉపకరించాయి. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ టీం ఏపీలో వైఎస్ జగన్ కోసం పని చేస్తోంది. ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని కోరుకోవడం లేదని చెప్పిన ప్రశాంత్ కిశోర్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని చెప్పారు. అన్నట్టుగానే ఆయన బిహార్‌లోని అధికార పార్టీ అయిన జేడీయూలో చేరారు. ప్రశాంత్ కిశోర్ చేరిక వల్ల తమ పార్టీ అన్ని వర్గాలకు చేరువ అవుతుందని, ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుందని జేడీయూ భావిస్తోంది.