YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఎక్స్‌క్లూజివ్ ఐల్యాండ్ ఫర్ వుమెన్‌..

ఎక్స్‌క్లూజివ్ ఐల్యాండ్ ఫర్ వుమెన్‌..

సమీపంలో సుందరమైన బుల్లి ద్వీపం ఒకటుంది.  ఇంత చిన్న ద్వీపం గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించడం అనుకుంటున్నారా?  ఇక్కడికి పురుషులను రానివ్వరు, కేవలం మహిళలకు మాత్రమే ఈ ద్వీపంలోకి ప్రవేశముంటుంది. అందుకే దీన్ని సూపర్ షి ఐల్యాండ్ అంటారు.  వుమెన్ ఓన్లీ ఐల్యాండ్ అయినప్పటికీ ఇక్కడ భద్రతకు వచ్చిన ఢోకా ఏమీ ఉండదు.  మహిళా పర్యాటకులు హాయిగా ఇక్కడ వెకేషన్‌ను ఎంజాయ్ చేసి, బోలెడన్ని మధురానుభూతులను మూటగట్టుకుని హ్యాపీగా తిరిగి వెళ్లవచ్చు. క్రిస్టినా రత్‌కు వచ్చిన ఐడియాతో దీన్ని స్పెషల్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చి, మహిళలను ఆకట్టుకునేందుకు ఈ దీవులను మరింత సుందరంగా మార్చారు.  మీపై మీరు ఫోకస్ పెట్టండి, ఈ లోకంపై కాదు అన్న ఉద్దేశంతోనే దీన్ని ఎక్స్‌క్లూజివ్ ఐల్యాండ్ ఫర్ వుమెన్‌గా మలచడం వెనకున్న కారణమని క్రిస్టినా వివరిస్తారు. ఎప్పుడూ బరువు, బాధ్యత, కట్టుబాట్లు, రూల్స్, రెగ్యులేషన్స్, కల్చర్, ట్రెడిషన్ వగైరా వగైరా మహిళా స్వేచ్ఛకు కళ్లాలు వేస్తాయని, అందుకే ఇలాంటి వింత ప్రపంచం గురించిన ఆలోచన తనకు వచ్చిందని ఆమె చెబుతారు. ఇక అన్ని వయసుల అమ్మాయిలు, మహిళలు ఇక్కడికి గ్రూపులుగా వచ్చి కొన్ని రోజుల పాటు తమను తాము మైమరచి, ప్రకృతిలో మమేకమవుతుంటారు. ఇక ఒంటరిగా వచ్చే మహిళా ప్రయాణికులకు తక్కువేం లేదు.  ఇక్కడ ఉన్న లగ్జురీ హోటెల్‌లోని సౌకర్యాలు హైలైట్‌గా ఉంటాయి. కావాలంటే సొంతంగా వంట చేసుకోవచ్చు, లేదంటే షెఫ్‌ల హోస్టింగ్‌తో బోలెడు రుచులు రుచి చూడవచ్చు.  బోటింగ్, గేమ్స్, బీచ్‌తోపాటు అన్ని సదుపాయాలున్న సూపర్ షి ఐల్యాండ్‌లో మరో ప్రపంచాన్ని చూడవచ్చు.  ప్రశాంతంగా ఉండే ఇక్కడి వాతావరణం మనసుకు స్వాంతన ఇస్తుంది.  ఈ ఐల్యాండ్ స్పెషాలిటీని మరింత వెలుగులోకి తెచ్చేందుకు ఇప్పుడు పలు ట్రావెల్ బ్రాండ్లు క్రిస్టినాతో చర్చలు జరుపుతున్నారు. ఏదేమైనా ఇలాంటి ఓ వింత ద్వీపం ఉంద నే విషయం ఇప్పుడిప్పుడే లోకానికి వెల్లడవుతోంది. 

Related Posts