ఉయ్యూరు మండలం తోట్లవల్లూరు నుండి పాముల లంక కు వెళ్లే కాజ్వే 9 లంక గ్రామాలకు చాలా ముఖ్యమైన కనెక్టింగ్ పాయింట్. ప్రస్తుతం మట్టిరోడ్డు తోట్లవల్లూరు నుండి పాముల లంక వరకు కృష్ణా నది మధ్యలో నుంచి ఉంది. కానీ నదిలో నీరు వచ్చినప్పుడు మద్దూరు నుండి ఐన పూరు వరకు ఉన్న లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధం తెగి పోతుంది . ప్రభుత్వం వారు ఈ కాజ్వే వేయటానికి నిధులు శాంక్షన్ చేశారని తెలిసింది. టెండరు అయిపోయి ఏజెన్సీలు కూడా ఫైనలైజ్ చేశారు. తోట్లవల్లూరు అప్రోచ్ రోడ్డు దగ్గర ఒక ప్రైవేటు స్థలం వాలంటరీగా డిపార్ట్మెంట్ కి హ్యాండోవర్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
అలాగే పాముల లంక సైడు ఎప్రోచ్ రోడ్డుకి గవర్నమెంట్ ల్యాండ్ చిన్న ముక్క ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ కి ఇవ్వవలసి ఉంది. త్వరగా సర్వే చేసి రెండు వైపులా వున్న చిన్న భూమి ముక్కలను
పి ఆర్ డిపార్ట్మెంట్ వారికి బదలాయిస్తే ఈ కాజ్వే పనులు త్వరగా జరుగుతాయి.
ఈ కాజ్వే రావటం ద్వారా 9 లంక గ్రామాల్లో ఉన్న పదివేల మందికి వర్షాకాలంలో, వరదల్లో, అత్యవసర పరిస్థితుల్లో కూడా తమ ఊరికి చేరుతాయి.