చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు మొదలు పెట్టిన హీరా ఇస్లామిక్ సంస్థ వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. మంగళవారం ఆ సంస్థ ప్రధాన నిర్వాహకురాలు నౌహీరా షేక్ను డిల్లోలో సీబీఐ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వెనువెంటనే దర్యాప్తు సంస్థకు చెందిన ఓ ప్రత్యేక బృందం ఆమె స్వస్థలమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, తొండవాడకు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నౌహీరా షేక్ సొంత ఇంటిని ధికారులు సోదాలు చేశారు. పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు వారికి దొరికినట్లు సమాచారం. దాడుల్లో సుమారు 15 మంది వరకు అధికారులు పాలు పంచుకున్నారు. హీరా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు మొదట ప్రారంభించిన ఆమె తర్వాత దాన్ని వ్యాపార సంస్థగా మార్చారు. ప్రజల నమ్మకమే పెట్టుబడిగా జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వేలాది మంది ముస్లిం సోదరుల వద్ద భారీగా డబ్బులు సేకరించారనే ఆరోపణలు సంస్థపై ఉన్నాయి. చైన్ లింకు వ్యాపారం మోడల్లో కొంత మొత్తం డబ్బు కడితే అధికమొత్తంలో నెలవారీ వడ్డీలు ఇస్తామని ఆశ చూపి వేలాది మంది వద్ద నుంచి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికల సమయంలోనూ హీరా సంస్థ కార్యకలాపాలపై పలు అభియోగాలు, ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా గతంలో సంస్థ కార్యకలాపాల తీరుపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిస్థుంది. ఆమె అరెస్ట్ తర్వాత... తెలంగాణ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తానని ఈ మద్య ప్రకటించారు. దీంథొ తెరాసతో కుమ్మక్కైన మజ్లీద్ పార్టీ నాయకులు ఆమెను ఈ కేసుల్లో ఇరికించారనేది ఓ విమర్శ. వందల కోట్లు డిపాజిట్ రూపంలో జిల్లాలొ సేకరించిన ట్టు సమాచారం. చంద్రగిరి తొండవాడ గ్రామానికి ఒకేసారి అంతమంది అధికారులు రావడంతో గ్రామస్థులంతా భయాందోళనకు గురయ్యారు.