ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తన పనులను చక్కబెడుతుంది. ఈ నేపధ్యం లో అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే బీజేపీ కూడా తన రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో తాడేపల్లి బ్రహ్మనంద పురం లో నిర్మించనుంది. మంగళవారం కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చేతులు మీదుగా డిజిటల్ శంకుస్థాపన జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యాలయం కు బుధవారం ముహూర్తం బాగుండటం తో భూమిపూజ నిర్వహించారు. ఒకటిన్నర ఎకరం లో నిర్మాణం కానున్న ఈ కార్యాలయం భూమి పూజ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చేశారు. కార్యలయం నిర్మాణం అనంతరం అన్ని పార్టీ వ్యవహారాలు ఇక్కడ నుండే నిర్వహించనున్నట్లు కన్నా తెలిపారు. ఏడాది కాలం లో ఇక్కడ పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తి అవుతుంది అని ఆయన అన్నారు...