ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ని ప్రముఖనగరం అలాహాబాద్ పేరును 'ప్రయాగ్ రాజ్' గా మారుస్తూ యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం యోగి అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్లో ఆమోదం తెలిపింది. 2019 కుంభమేళాకు ముందే అలాహాబాద్ పేరును 'ప్రయాగ్ రాజ్' గా మార్చడం సంతోషంగా ఉందని యూపీ మంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్ క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. అలాహాబాద్ ప్రజలు, ఋషులు, జోయ్తిష్య పండితులు అలాహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చాలని చాలాకాలంగా కోరుతున్నారని చెప్పారు.