వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత ఎన్టీఆర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతి వర్మను ఈ ఉదయం కలుసుకున్నారు.సందేశాత్మకంగా ఈ చిత్రం ఉండేలా చూడాలని తాను ఆయన్ను కోరానని లక్ష్మీపార్వతి మీడియాకు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోనని, ఇదే సమయంలో జగన్ ను సీఎం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. వర్మ తీస్తున్న చిత్రం తనను అగౌరవపరిచే విధంగా ఉండదనే నమ్ముతున్నానని, అసలు వాస్తవాన్ని మాత్రమే చెప్పాలని తాను కోరగా, వర్మ అంగీకరించారని అన్నారు. ఆ మహానుభావుడి చరిత్రను, చివరి రోజుల్లో జరిగిన నిజాన్ని ప్రజలకు చెప్పాలని 22 సంవత్సరాలుగా ఎదురుచూశానని, ఇంతకాలానికి వర్మ ముందుకు రావడం సంతోషకరమని లక్ష్మీ పార్వతి అన్నారు..