'మీటూ' ఉద్యమం ఫై దక్షిణాది నటి ఆండ్రియా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'మీటూ' ఉద్యమాన్ని స్వాగతిస్తున్నానని చెబుతూనే, స్టార్ గా వెలిగిపోవాలని, రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలని భావిస్తున్న అమ్మాయిలు, వారికి ఇష్టం లేకుండానే మగవారి గదుల్లోకి వెళుతున్నారా? అని ప్రశ్నించింది. ఇప్పటివరకూ అవకాశాల పేరు చెప్పి తనను ఎవరూ వాడుకోవాలని చూడలేదని చెప్పింది. పని కావాలంటూ వెళ్లే మహిళలు అందుకు అంగీకరించకుండా ఉంటే ఎలాంటి సమస్యా తలెత్తదని చెప్పుకొచ్చింది.