YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంత నేతల మైండ్ గేమ్

అనంత నేతల మైండ్ గేమ్
అనంతపురం జిల్లాలో వైసీపీ ఆడుతున్న మైండ్‌గేమ్‌లో టీడీపీ నేతలు చిక్కుకుంటున్నారట. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాని అడ్డుపెట్టుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు భారీగా ప్రచారం చేసుకుంటున్నారట.అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారట. ఆ ఉచ్చులో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు సునాయాసంగా చిక్కుకుంటున్నారట. ఈ మాట తెలుగు తమ్ముళ్లతోపాటు రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. సోషల్‌ మీడియాని వేదికగా చేసుకుని రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు- ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. అయితే అనంతలో పరిస్థితి ఒకింత ముదిరింది. “బహిరంగ చర్చకు సిద్ధమా?” అంటూ సవాళ్లు విసురుకునే ట్రెండ్‌ మొదలైంది. పనిలో పనిగా వేదికలను కూడా ప్రకటించుకుంటున్నారు.నాయకులు తమ తమ వర్గీయులతో ఆయా చర్చా వేదికల వద్దకి వెళ్లేందుకు ప్రయత్నించడం, పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.భారీగా అనుచరులను వెంటబెట్టుకుని అధికార, విపక్ష నేతలు వాదోపవాదాలకు దిగితే ఉద్రిక్తతలు తలెత్తక మానవు. అందుకే శాంతిభద్రతల పరిరక్షణార్థం పోలీసులు వారికి ఆ అవకాశం ఇవ్వడం లేదు. అయితే వారిని అదుపుచేసే క్రమంలో పోలీసులు పడుతున్న తిప్పలు అన్నీఇన్నీ కావు. ఇటీవల శింగనమలలో ఎమ్మెల్యే యామిని బాల, స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జ్‌ జొన్నలగడ్డ పద్మావతి మధ్య బహిరంగ చర్చ ప్రస్తావన వచ్చింది. ఇరు పక్షాల వారు చర్చకి సిద్ధపడ్డారు. అయితే పోలీసులు ఇరు వర్గాలనూ అడ్డుకున్నారు. ఇదే విధంగా మంత్రి కాలవ శ్రీనివాసులు, వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డి మధ్య కూడా పరస్పర సవాళ్లు కొనసాగాయి. ఇరు పక్షాలు బహిరంగ చర్చకు రెడీ అవడంతో రాయదుర్గంలో వాతావరణం వేడెక్కింది. ఇరు పక్షాలను కంట్రోల్‌ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మిగతా నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఇదే తరహా ఎత్తుగడని ప్రయోగిస్తోందట. టీడీపీ నేతలను అదే పనిగా రెచ్చగొడుతోందట. తద్వారా సోషల్‌ మీడియాలో ఆ పార్టీ విస్తృత ప్రచారం పొందుతోందట. అటు అధికార, పోలీసు యంత్రాంగాలతోనూ ఓ ఆట ఆడుకుంటోందట. ఈ నేపథ్యంలో వైసీపీ పన్నుతున్న ఉచ్చులో చిక్కుకోవద్దు అని అధికార పక్షానికి విశ్లేషకులు సూచిస్తున్నారు. అనంత టీడీపీ ప్రజాప్రతినిధులు ఇకపై జాగ్రత్తపడటం మంచిదేమో

Related Posts