తిరుమల శ్రీవారిని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా యూనిట్ శుక్రవారం నాడు దర్శించుకుంది. దివంగత ఎన్టీఆర్ సతిమణి లక్ష్మీ పార్వతీతో పాటు దర్శకుడు రాంగోపాల్ వర్మ కుడా యూనిట్ లో వున్నారు. . లక్ష్మీ పార్వతీ మాట్లాడుతూ చాలా చక్కగా సినిమా ను జరిగింది జరినట్టు, ఉన్నది ఉన్నట్టు లక్మ్మీస్ ఎన్టీఆర్ సినిమాను రాంగోపాల్ వర్మ చిత్రీకరించారని అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మకి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది ఈ రోజని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లొ వైయస్ జగన్ కే నా మద్దతని ఆమె స్పష్టం చేసారు. గురువారం నాడు చిత్తూరు జిల్లాలో కాణిపాకం వరసిద్ధివినాయకున్ని ఈ యూనిట్ దర్శించుకుంది. ఎపుడు వివాదాల సినిమాలు, వివాదాల అంశాలతో బిజీగా ఉండే రాంగోపాల్ వర్మ ఇపుడు గుడులు చుట్టు తిరుగుతూ మొక్కులు చెల్లించడం హాట్ టాపిక్ గా మారింది.