ఉత్తరాంధ్రలో తిత్లీ తుఫాన్ అల్లకల్లోలం చేస్తే, పవన్ కళ్యాణ్ కవాతు నిర్వహించుకున్నారు. తుఫాన్ వచ్చినప్పుడు రద్దుచేసుకుని బాధిత ప్రజల వద్ధకు వెళ్లాల్సింది పోయి, రాజమండ్రిలో కవాతు నిర్వహించారని హోం మంత్రి చిన రాజప్ప విమర్శించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. సిఎం చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేయడమే పనిగా పవన్ పెట్టుకున్నారు. పవన్ తానేదో పైనుండి దిగివచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలందరూ అవినీతి పరులని విమర్శిస్తున్న పవన్ తనపార్టీలో చేరినవారిలో నేర చరిత్ర ఉన్నవారెందరో తెలుసుకోవాలని అన్నారు. ఉద్ధానవం నాకెంతో ఇష్టమన్న పవన్ 6 రోజులవరకూ అక్కడకు వెళ్ళలేదు. పక్కజిల్లాలో ఉండి యాత్ర చేస్తున్న జగన్ కి కూడా తుఫాన్ ప్రాంతాల బాధితుల బాధలు పట్టలేదు. కేంద్రం ఇప్పటివరకూ తుపాను నష్టానికి సంబంధించి ఎటువంటి సహకారం అందించలేదు. తొలి విడతగా 2500 కోట్లు కేంద్ర సాయం కోరాం. కేంద్రం ఇంతవరకూ తుపాను నష్టం పై స్పందించలేదనిఅయన అన్నారు.