రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను ఏపి ప్రజలు చంద్రబాబు బినామీగా చెప్పుకుంటారు. అయన తన దిగజారుడు తనం చూపించాడు. ఇకనైనా అయన సగం మీసం తీసేస్తే బాగుంటుందని భీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి వాళ్లను పెద్దల సభకు పంపినందుకు సీఎం ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. తన పదవికి రాజీనామా చేయించాలి. సీఎం రమేష్ 100 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు. దొంగ దీక్షలు చేసే వ్యక్తి వీటికి సమాధానం చెబుతారా తప్పించుకుని తిరుగుతాడా అని ప్రశ్నించారు. పెద్దల సభకు ఇలాంటి దిగజారుడు మనుషులకు బాబు పంపకూడదు. తన కంపెనీ అకౌంట్స్ లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తి పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ మొంబర్ గా ఉండటం సరికాదని అన్నారు.
దోచుకోవడానికి తనకు హోదా కల్పిస్తున్నారా. మీరు రమేష్ పై చర్యలు తీసుకోకపోతే ఎతిక్స్ కమిటీకి నేనే పిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయన పదవిపోయేదాక పోరాటం చేస్తాం. ఐటీ కంపెనీల వివరాలు చెప్పడానిక ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం. ఐటీ కంపెనీలకు పోత్సాహకాల పై అక్రమాలకు పాల్పడ్డారని అయన ఆరోపించారు. పవన్ అడుగుతున్నాడు లోకేష్ కు మంత్రి అవ్వడానికి ఎమి అర్హత ఉందని. లూటీ చేయడానికా ఐటీ మంత్రి అయ్యిందని అన్నారు. 24 గంటల్లో ఐటీ కంపెనీల వివరాలు భయటపెట్టాలి. లేకుంటే పూర్తి స్ధాయిలో అక్రమాలకు పాల్పడడ్డారని ప్రజలు అనుకుంటారు. విజయవాడకు ప్రపంచ స్థాయి కంపెనీలు కంపెనీలు వచ్చాయి అంటున్నారు అవి ఎక్కడని అడిగారు. కడప స్టీల్ ప్యాక్టరీ పై కేంద్రం క్లారిటీగా ఉంది రాష్ట్రప్రభుత్వం చేయవలసిన పనులు చేయడం లేదు. చేయవలసిన పనులు చేయకుండా దొంగ దీక్షలు చేస్తున్నారు. 100 కోట్లు ట్యాక్స్ ఎగవేతకు పాల్పడి రమేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.