YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

50,802 భారతీయులకు యూఎస్‌ సిటిజెన్‌షిప్‌

50,802 భారతీయులకు యూఎస్‌ సిటిజెన్‌షిప్‌
2017లో 50వేల మందికి పైగా భారతీయులు అమెరికా పౌరసత్వాన్ని పొందారని తాజా అధికారిక ప్రకటనలో వెల్లడైంది. 50,802 భారతీయులు యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ను పొందినట్లు హోమ్‌లాండ్ సెక్యూరిటీ 2017 సంవత్సరానికి విడుదల చేసిన వార్షిక వలసల నివేదికలో పేర్కొంది. అంతకుముందు సంవత్సరం(2016)తో పోల్చుకుంటే నాలుగువేల మందికి పైగా పౌరులకు అదనంగా పౌరసత్వం మంజూరైందని తెలిపింది.2016లో ఆ సంఖ్య 46,188. 2015లో 42,213మంది పౌరసత్వాన్ని పొందారు. 2015తో పోల్చుకుంటే 8,000 మంది అదనంగా అమెరికన్‌ పౌరులుగా మారారు.మొత్తంగా 2017లో 7,07,265 మంది విదేశీయులు యూఎస్‌ పౌరసత్వాన్ని సొంతం చేసుకున్నారు. 2016లో ఆ సంఖ్య 7,53,060 కాగా 2015లో 7,30,259. విదేశీయుల్లో అమెరికన్ పౌరసత్వం పొందినవారిలో మెక్సికన్లు(1,18,559) మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా(37,674), ఫిలిప్పైన్స్‌(36,828), డొమినిక్‌ రిపబ్లిక్‌(29,734), క్యూబా(25,961)లు ఉన్నాయి. పౌరసత్వం పొందిన వారిలో పురుషుల( 3,10,987) కంటే మహిళల(3,96,234) సంఖ్యే అధికం కావడం గమనార్హం. అలాగే కొత్తగా యూఎస్ పౌరులుగా మారిన భారతీయులు కాలిఫోర్నియాలో నివసించడానికి మొగ్గు చూపుతున్నారని నివేదిక వివరించింది. న్యూజెర్సీ , టెక్సాస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Related Posts