ఓ మహిళతో తనకు సంబంధం అంటగట్టారని ఫీలయిన మదానీ బాబా అనే ఓ సాధువు.. తన మర్మాంగాలను కోసుకున్నాడు. ఈ ఘటన యూపీలోని బామ్నా జిల్లాలో జరిగింది. స్థానికంగా ఉండే ఓ మహిళతో తనకు అనవసరంగా సంబంధం అంటగట్టారని ఆ సాధువు ఆరోపించాడు. ఓ స్థలంలో తాను ఆశ్రమం కట్టడం ఇష్టం లేని కొందరు వ్యక్తులు తనపై ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సదరు బాబా విమర్శించాడు. 28 ఏళ్ల మదానీ బాబా అనే ఆ వ్యక్తి కంసిన్ గ్రామంలో ఉంటున్నాడు. తనపై వచ్చిన ఆరోపణలకు నిరసనగా అతడు తన మర్మాంగాలను కోసుకున్నాడు. అతనికి ప్రస్తుతం చికిత్స జరుగుతున్నది అని బామ్నా జిల్లా ఆసుపత్రి డాక్టర్ బల్వీర్ సింగ్ వెల్లడించారు. దీనిపై జిల్లా పోలీసులు విచారణ చేపడుతున్నారు.