YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గన్నవరం నుంచి ఇంటర్నేషనల్ సర్వీసులు

 గన్నవరం నుంచి ఇంటర్నేషనల్ సర్వీసులు

గన్నవరం విమానాశ్రయం నుంచి మొదటి అంతర్జాతీయ సర్వీస్‌ ఈనెల 25న ప్రారంభం కానుంది. ఏళ్ల తరబడి ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న వారి కల నెరవేరబోతోంది. ఈనెల 25న తొలి సర్వీసు గాలిలోకి లేవబోతోంది. ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చిన.. కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. ఇక విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిచేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే. గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఈనెల 25న గురువారం తొలి విమానం బయలుదేరబోతోంది. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. మరో నాలుగు రోజులే సమయం ఉన్నందున..  టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు.విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఆరు నెలల్లోనే విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌తో పాటు అన్ని సౌకర్యాలూ సిద్ధమైపోయాయి. అప్పటినుంచి పలురకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన వ్యవహారం.. ఇన్నాళ్లకు పట్టాలెక్కింది. అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఇన్నాళ్లూ అడ్డంకిగా మారిన కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయ డైరెక్టర్‌ నుంచి ఇండిగో సంస్థకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ సమాచారం అందించారు. ఈనెల 25 నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ.. ఇండిగోకు తెలియజేశారు. దీంతో నేటి నుంచి టిక్కెట్ల విక్రయం ఆరంభం కాబోతోంది.కనీసం 40 రోజుల ముందు టిక్కెట్ల విక్రయం ఆరంభించాల్సి ఉంటుంది. 180 సీట్ల ఇండిగో బోయింగ్‌ గన్నవరం నుంచి సింగపూర్‌కు ఈనెల 25న బయలుదేరి వెళ్లనుంది. టిక్కెట్ల విక్రయం ఆరంభమవ్వగానే.. 25వేల మందికి ఎస్ ఎం ఎస్ రూపంలో సమాచారం వెళ్లిపోయే వ్యవస్థ ఇండిగోకు ఉంది. అందుకే టిక్కెట్ల విక్రయం పెద్ద సమస్య కాదని ఇండిగో, విమానాశ్రయం, ఏపీఏడీసీ అధికారులు భావిస్తున్నారు. హాట్‌కేకుల్లా టిక్కెట్లు అమ్ముడైపోనున్నాయన్నారు. వారంలో గురు, మంగళవారాల్లో తొలుత నడపనున్నారు. ఈనెల 25 గురువారం అయ్యింది. మంగళవారం 30న వస్తోంది. ఈలోగా రెండో సర్వీసుకు టిక్కెట్ల విక్రయానికి సమయం ఉంటుంది.

Related Posts