కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుమూడి నుంచి చినగుడుమోటు పోవు ఆర్&బి రోడ్డు పూర్తిగా పాడయిపోయినది. లింగారెడ్డిపాలెం,జార్జెపేట, పోటుమీద, చినగుడుమోటు,మందపాకల, చింత కొల్లపాలెం గ్రామాల ప్రజలు నిత్యం అవనిగడ్డ చేరుకొనుటకు చాలా దగ్గర రహదారి మరియు 10వేల ఎకరాల రైతులు తన పొలం పనులకు ఈ రోడ్డును వాడతారు. ఈరోడ్డు పాడయి పోవుటచే కూలీలు పొలంలోకి రావాలంటే కూడా చాలా భయపడుతున్నారు. దీనివలన రైతులు వారి యొక్క ఎరువులు మందులు పండిన పంట లను ఈ రోడ్డు మీద తీసుకు వెళ్ళటానికి తీసుకురావటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఈ రోడ్డుకు అనుసంధానమైన గ్రామ ప్రజలు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ రోడ్డును నాబార్డ్ PMGSY III క్రింద మంజూరు చేయాలి. ఈ రోడ్డు మంజూరు విషయంలో అధికారులతో మాట్లాడి గ్రామా ప్రజలకు సహాయం చేయాలి.