- మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన నరేంద్ర మోదీ
- ఈ నెల 10-11 తేదీల్లో యుఏఈలో
- ఒమన్‌లో ఈ నెల 11-12 తేదీల్లో ఒమన్‌లో ప్రధాని పర్యటన
పశ్చిమ ఆసియా, గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడమే ఏజెండాగాభారత భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనను శుక్రవారం ప్రారంభించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు బయల్దేరారు. పర్యటనలో భాగంగా ముందుగా పాలస్తీనాలో పర్యటించి అక్కడి నుంచి యూఏఈ, ఒమన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు.గత ఆరునెలల క్రితం (జులై) ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధానిగా మోదీగా నిలిచారు. ఆ తరువాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహూ ఈ ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించారు. మూడు దేశాల పర్యటనలో ఇజ్రాయెల్ దేశ బద్ధశత్రువైన పాలస్తీనా పర్యటనకు మోదీ వెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పాలస్తీనాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం. పాలస్తీనా నుంచి మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లనున్నారు అనంతరం మోదీ ఒమన్‌లో పర్యటించనున్నారు. సోమవారం నాటికి ప్రధాని పర్యటన ముగియనుంది.
ఢిల్లీ నుంచి బయల్దేరిన ప్రధాని మోదీ జోర్డాన్ రాజధాని అమ్మాన్ చేరుకొని అక్కడి కింగ్ అబ్దుల్లా-2ను శుక్రవారం కలువనున్నారు. అక్కడి నుంచి వెస్ట్ బ్యాంకులోని రామల్లాకు హెలికాప్టర్ ద్వారా మోదీ చేరుకొని పాలస్తీనా నేత మహమూద్ అబ్బాస్‌ను కలువనున్నారు. ఈ పర్యటన ద్వారా వెస్ట్ ఆసియా, గల్ఫ్ రీజియన్ దేశాలతో భారత్‌కు మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు మోదీ ఫేస్‌బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు. యుఏఈలో ఈ నెల 10-11 తేదీల్లో పర్యటించనున్నారు. గల్ఫ్ దేశాన్ని ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా మోదీ పేర్కొన్నారు. యూవీఈ పర్యటన ముగిసిన అనంతరం ఒమన్‌లో ఈ నెల 11-12 తేదీల్లో పర్యటించనున్నారు. భారత ఆర్ధికపరమైన సంబంధాలను బలోపేతం చేసేందుకు ఒమన్‌లోని వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు.