విజయవాడలోని ఆటోనగర్ లోని ఎకరా స్థలంలో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ 2004 నుండి 2014 వరకు ఆనాటి పాలకులు 674 మందిని చంపారు. శాసన సభ్యులు పరిటాల రవీంద్ర నీ చంపారు. ఆనాటి పాలకులు శాసన సభలో చంద్రబాబు కే హెచ్చరిక లు చేసారు. పార్టీ కార్యకర్తలను హింసించి చంపించినా నమ్ముకున్న జెండానే అంటిపెట్టుకుని ఉన్నారన్నారు. కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటుచేసి మూడు వేల కుటుంబాలను ఆదుకున్నామన్నారు. విభాగం ఏర్పాటయ్యాక కార్యకర్తల సంక్షేమానికి రూ.23 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 35 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీకి ఇంతవరకు సొంత భవనాల్లేవన్నారు. కార్యకర్తలు కోసం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు దేశం లో ఎక్కడా లేవు. మనం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని అన్నారు. మీరు నామీద ఆరోపణలు చేసారు మీకు దమ్ము ధైర్యం ఉంటే నామీద చేసిన ఆరోపణలు నిరూపించండి. జగన్ పక్క జిల్లాలో పర్యటన చేస్తూ శ్రీకాకుళం రాలేక పోయాడు. పవన్ కళ్యాణ్ వారం తరవాత వొచ్చి చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తాడని విమర్శించారు.