ఇంద్రకీలాద్రి ఆలయ చరిత్రలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు ఈ ఏడాది జరిగాయి. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం తో ఉత్సవాలు విజయవంత అయ్యాయని దుర్గ గుడి ఈవో కోటెశ్వరమ్మ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆసారి రెట్టింపు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. వచ్చే ఏడాది నుంచి క్రౌడ్ కౌటింగ్ సిస్టం యాప్ అందుబాటులోకి వస్తాయి దసరా ఉత్సవాలుకు మొత్తం రూ. 8.4 కోట్ల ఖర్చు అయ్యాయి. ఆలయంనాకి వచ్చిన మొత్తం ఆదాయం రూ.5.18 కోట్లు. అందులో లడ్డు ప్రాసాదం ఆదాయమే రెండు కోట్లు వచ్చిందని అమె వెల్లడించారు. ఈ ఏడాది 18 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు. 2.4 లక్షల మంది భక్తుకు ఉచిత అన్న ప్రసాదం అందించాం. ఇప్పటి వరకు ఉత్సవాలలో పాల్గొన్న ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ దేవస్థానం చెల్లింపులు జరుపుతోంది. వచ్చే ఏడాది నుంచి ఏ డిపార్ట్మెంట్ కు ఆ డిపార్ట్మెంట్ ఖర్చులు భరిస్తాయని ఆమె అన్నారు.