నెల్లూరు నగరంలోని ప్రఖ్యాతమైన మూలాపేట జామియా నూరుల్ హుదా మదర్స ఇస్లామిక్ విద్యా సంస్థల్లో అధునాతన మౌళిక వసతుల కల్పన పరిశీలనలలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ శనివారం మదర్సను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కీలకమైన ముస్లిం మత పెద్దలు మంత్రితో చర్చిస్తూ, రాబోవు ఎన్నికల్లో నెల్లూరు నగర ఎమ్మెల్యే స్థానాన్ని అబ్దుల్ అజీజ్ కు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ విధివిధానాలపై జిల్లా వ్యాప్తంగా ముస్లిం సామజిక వర్గ ప్రజలకు అఖండమైన నమ్మకం ఏర్పడుతుందని ఆయనకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీ సామజిక వర్గానికి ప్రత్యేకంగా అందిస్తోన్న సంక్షేమ ఫలాలను క్షేత్ర స్థాయి వరకూ చేరవేసేందుకు అజీజ్ చేస్తున్నకృషిని తెలుగుదేశం పార్టీ గుర్తించాలని ముస్లిం మత పెద్దలు మంత్రిని కోరారు.
అనంతరం మేయరు మాట్లాడుతూ దాదాపు యాభై ఏళ్ళ నుంచి ఇస్లామిక్ ఆధ్యాత్మిక విద్యా సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మదర్సాలో ఉన్నత స్థాయి మరుగుదొడ్లూ, వృత్తి నైపుణ్యా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి పేద విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు నింపాలని మంత్రిని కోరామని తెలిపారు. సుమారు 550 మంది విద్యార్దులున్న మదర్సాలో పూర్తిస్థాయి వసతుల కల్పనకు మంత్రి నారాయణ సహకారంతో అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి త్వరలో నిర్మాణాలను చేపడుతామని మేయరు వెల్లడించారు.
మంత్రిని కలిసిన వారిలో ఉభయ తెలుగు రాష్ట్రాల జమాతే ఉలేమా హింద్ ఉపాధ్యక్షులు మౌలానా ఇలియాజ్, సంస్థ నిర్వాహకులు ముఫ్తీ అబ్దుల్ వాహేబ్, బారాషహీద్ ఈద్గా ఇమామ్ అబూబకర్ అష్రఫీ, జిల్లా ముస్లిం పెద్దలు మొయునుద్దీన్, షేక్ అహమద్, నన్నేసాహేబ్, ఖాజావలి, సయ్యద్ సమీ, మున్వర్, హయత్ బాబా, సయ్యద్ మౌలానా జలాలుద్దీన్, మౌలానా రషీద్ అహమద్, ముఫ్తీ షోయబ్ అహమద్, మౌలానా అబ్దుల్ రవూఫ్, హాజీ షబ్బీర్ అహమద్, షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.