YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యదేఛ్చగా పడవలతో ఇసుక రవాణా

 యదేఛ్చగా పడవలతో ఇసుక రవాణా

కృష్ణానది ఎగువ ప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో ఇసుక పడవలు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నా, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణానదిలో పడవ తిరగాలంటే విజయవాడలోని ఇరిగేషన్‌ కార్యాలయంలో రిజర్వ్‌ కన్జర్వేటర్‌ అనుమతి తీసుకోవాలి. పడవ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌తో పాటు, ఇంజన్‌ పని విధానం, అది మోయగల బరువు సామర్థ్యాన్ని నిర్ధారిస్తూ సర్టిఫై చేయాలి. అంతేకాకుండా పడవ నడిపేవారు కాకినాడలో శిక్షణ పొంది లైసెన్సు తీసుకోవాల్సి ఉంది.కృష్ణానది ఎగువ ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం ఇసుక రీచ్‌ సమీపంలో ఒక పడవ నీటమునిగింది. ఆ సమయంలో పడవ మీద నలుగురు కార్మికులు ఉన్నారు. ఈత రావడంతో ఈదుకుంటూ నది మధ్యలో నుంచి ఎలాగోలా బయటకు వచ్చారు. ఇంత జరుగుతున్నా కనీసం అధికారులకు కృష్ణానదిలో పడవ మునిగిందనే విషయమే తెలియకపోవడం గమనార్హం. ప్రకాశం బ్యారేజి నుంచి అమరావతి వరకు ప్రతిరోజూ ఇసుకలోడుతో వేల పడవలు తిరుగుతున్నాయి. వాటిని ఇప్పటి వరకు ఇరిగేషన్‌ అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. సంవత్సరానికి కృష్ణాతీరంలో ఏదో ఒకచోట 10 నుంచి 15 పడవలు మునిగిపోతున్నాయి ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు అధికారులు హడావుడి సృష్టిస్తున్నారు తప్ప, తిరిగే పడవలకు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయం పరిశీలించడం లేదు. ప్రస్తుతం ఉద్ధండరాయనిపాలెంలో మునిగిపోయిన పడవను ఇసుక మాఫియా బయటకు తీయకుండా వదిలేసింది. క్వారీలో ఎవరూ లేని సమయంలో దాన్ని బయటకు తీద్దామన్న ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతజరుగుతున్నా ఇరిగేషన్‌ అధికారులు మాత్రం ఆ చుట్టుపక్కల కనిపించకపోవడం విశేషం.

Related Posts