YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

వినాయక్ ముద్ర కనిపించలేదు..

వినాయక్ ముద్ర కనిపించలేదు..

- ‘ఇంటిలిజెంట్’ రివ్యూ 

వివి వినాయక్ సినిమా హ్యాండిల్ చేసిన తీరు వివి వినాయక్ సినిమా అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఉంది. మాస్ మసాలా,కమర్షియల్ ఎలిమెంట్స్ కావాల్సినన్ని ఉంటాయని ప్రేక్షకులు థియేటర్లకువస్తారు. అయితే వినాయక్ తన స్థాయికి తగిన విధంగా సినిమాను హ్యాండిల్ చేయలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ ఎపిసోడ్లు, కామెడీ సీక్వెన్స్ ఇలా ఏ విషయంలోనూ వినాయక్ ముద్ర కనిపించలేదు. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్‌గా ఉంది.

మెగా డైరెక్టర్ వివి వినాయక్, మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇంటిలిజెంట్' సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ముందు నుండి మంచి అంచనాలు ఉన్నాయి. వరుస ప్లాపులతో ఉన్న సాయి ధరమ్ తేజ్‌ను వినాయక్ తన కమర్షియల్ ఫార్ములాతో హిట్ బాట పట్టిస్తాడని అంతా నమ్మకంగా ఎదురు చూశారు. గతంలో నాయక్, తులసి, లక్ష్మి లాంటి హిట్ చిత్రాలకు కథ అందించిన ఆకుల శివ ఈ చిత్రానికి కథ సమకూర్చడంతో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి కారణమైంది. మరి ఈ సనిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించింది అనేది సమీక్షలో చూద్దాం.

కథ నంద కిషోర్ (నాజర్) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ రన్ చేస్తూ టెక్నాలజీ ఉపయోగించి పేద ప్రజలకు సహాయం అందేలా చేయడంతో పాటు, తనూ నలుగురికి సహాయం చేస్తుంటాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయి ధరమ్ తేజ్‌ టాలెంట్ గ్రహించిన నందకిషోర్ తన ఖర్చుతో మన హీరోను చదవిస్తాడు. పెరిగి పెద్దయి సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన హీరో బయటి కంపెనీల్లో పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నా లెక్కచేయకుండా నందకిషోర్‌కు చేదోడువాదోడుగా ఉంటూ నలుగురికీ సహాయం చేయడంలోనే ఆనందం వెతుక్కుంటూ ఉంటాడు. అంతా సవ్యంగా జరిగితే సినిమా ఎలా అవుతుంది?... సీన్లోకి విలన్ విక్కీ భాయ్(రాహుల్ దేవ్) ఎంటరవుతాడు. కంపెనీ తన పేరున రాయాలని బెదిరిస్తాడు. వినక పోవడంతో నందకిషోన్‌ను చంపేసి కంపెనీ తన పేరున రాయించుకుంటాడు. తాను ఇంతటివాడిని కావడానికి కారణమైన బాస్‌ను చంపిన వారిపై హీరో ఎలా రివేంజ్ తీసుకున్నాడు? అనేది మిగతా కథ. ఆకుల శివ కథ ఆకుల శివ అందించిన స్టోరీ పరమ రోటీన్‌గా ఉంది. సాదా సీదా రివేంజ్ డ్రామా చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. వెతుకుదామన్నా సినిమాలో ఒక్క ట్విస్ట్ కూడా కనిపించదు. దీనితోడు లాజీక్ లేని సీన్లు కూడా ప్రేక్షకులకు బోర్ తెప్పిస్తాయి.
సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ వంకపెట్టే విధంగా ఏమీలేదు.అదే సమయంలో గొప్పగా చెప్పుకోవడానికి కూడా లేదు. ఎప్పటిలాగే రోటీన్ గా కనిపించాడు. ధర్మాభాయ్ పాత్రలో ప్రత్యేక శైలి చూపించలేకపోయాడు. ఫైట్స్‌ ఇరగదీశాడు... చమక్ చమక్ ఛాం పాటలో చిరంజీవిని గుర్తు చేశాడు.

స్నేక్ గ్యాంగ్‌కు, సినిమాకు లింకు ఉందా? ఇటీవల ఇంటర్వ్యూలో దర్శకుడు వివి వినాయక్ స్నేక్ గ్యాంగ్ గురించి తమ సినిమాలో కొన్ని సీన్లు చూపించామని చెప్పారు. కానీ సినిమాలో కేవలం పాములతో చంపే ఓ సీన్ తప్ప... ఆ గ్యాంగ్ గురించి ఏమీ లేదు. అది జస్ట్ పబ్లిసిటీ స్టంటే అని మనం అర్థం చేసుకోవాలి.

ప్లస్, మైనస్ పాయింట్స్ సాయి ధరమ్ తేజ్, సినిమాటోగ్రఫీ, చమక్ చమక్ ఛాం రిమిక్స్...ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. కథ, కథనం, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి.

చివరిగా కేవలం వివి వినాయక్ బ్రాండ్ నేమ్ ప్రేక్షకుడిని థియేటర్ వరకు నడిపించింది. కానీ ప్రేక్షకుడికి అక్కడ వినాయక్ నుండి ఆశించిన ఎంటర్టెన్మెంట్ దక్కలేదు. సాయి ధరమ్ తేజ్‌లో టాలెంట్ ఉన్నా హిట్ కథలు ఎంపిక చేసుకోవడంతో మరోసారి తడబడ్డాడు.

 

Related Posts