YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సర్కార్ టీజర్ 13 మిలియన్ వ్యూస్

సర్కార్ టీజర్ 13 మిలియన్ వ్యూస్

తమిళ రాజకీయాల్లో కీలకం కానున్నారా? త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఆయన పొలిటికల్ అరంగ్రేటానికి ప్లస్ అవుతుందనే మురుగదాస్ ‘సర్కార్’ చిత్రాన్ని రూపొందించారా? అంటే అవుననే సమాధానాలు తమిళ తంబీల నుండి వ్యక్తమవుతోంది. తుపాకి, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తరువాత మురుగదాస్, విజయ్ కాంబినేషన్‌లో మూడో చిత్రంగా తెరకెక్కిన ‘సర్కార్’ టీజర్‌ను విజయదశమి కానుకగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విడుదలైన ఈ టీజర్ కేవలం పది నిమిషాల వ్యవధిలో మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసింది. ఇప్పటివరకూ ఈ టీజర్‌ 13 మిలియన్ల డిజిటల్ వ్యూస్‌ని రాబట్టి సరికొత్త రికార్డులు వైపుగా దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయిక పాత్రలో కనిపిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిచింది. దీపావళి కానుకగా నవంబర్ 6న భారీ స్థాయిలో విడుదలకానుంది ‘సర్కార్’. ఈ టీజర్ విషయానికి వస్తే.. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ‘సర్కార్’ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు మురుగుదాస్. ముఖ్యంగా ఇందులోని డైలాగ్స్ విజయ్ పొలిటికల్ ఎంట్రీకి బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ వాయిస్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో ‘వాడొక కార్పోరేట్ రాక్షసుడు ఏ దేశానికి వెళ్లినా వాళ్లని నాశనం చేసే వెళ్తాడు.. వాడు ఇప్పుడు ఇండియా వచ్చాడు’ లాంటి డైలాగ్‌ ఆలోచింపజేసేదిగా ఉంది. ‘నేను ఏ కంపెనీని కొనడానికి రాలేదు. ఈ రోజు ఎలక్షన్ డే కదా నేను నా ఓటు వేయడానికి వచ్చాను’ అంటూ వేలు చూపించడం .. ‘ఇంకొక్క రోజులో ఏమేమి మారతాయో వెయిట్ చేయండి.. నేనో కార్పోరేట్ క్రిమినల్‌ని’, ‘మీ ఊరి నాయకుడ్ని వెతికి పట్టండి ఇదే మన ‘సర్కార్’ లాంటి డైలాగ్స్.. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి బలాన్ని చేకూర్చేవిగా ఉన్నాయి. దీంతో విజయ్ ఈ చిత్రాన్ని పొలిటికల్ ప్లాట్ ఫామ్‌గా ఉపయోగించుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు ఈ మూవీ ఆడియో వేడుకలోనూ తన పొలిటికల్ ఎంట్రీపై సానుకూలమైన స్పందన తెలియజేశారు విజయ్. రాజకీయాల్లోకి వస్తున్నారా? అంటే త్వరలో రావొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటికే రజినీకాంత్, కమల్ హాసన్‌లు వచ్చే ఎన్నికల సంగ్రామానికి పావులు కదుపుతున్నారు. ఇక లారెన్స్ కూడా పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో ద్వారా తమిళ పాలిటిక్స్.. సినిమా రంగు పులుముకోనుంది.

Related Posts