పెడన లో ఉన్నటువంటి కలంకారి కృష్ణా జిల్లాకు ఒక USP. దీనిని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రమారమి 2000 మంది కలంకారి కుటుంబాలను ఈ మధ్యకాలంలో గుర్తించి నారు. వారికి సరి అయిన వసతులు కల్పించి నట్లైతే కలంకారి ద్వారా దేశవిదేశాలలో మన కృష్ణా జిల్లా కు మరింత పేరు వస్తుంది.
వీరికి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ లేదు. అందువలన కేంద్ర ప్రభుత్వము ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వారు వారి సిబ్బందిని నియమించ క , ఎంతో ఎక్స్పోర్ట్ పొటెన్సీల్ ఉన్నటువంటి ఈ కలంకారీ అనుకున్నంత పురోగతి పొందడం లేదు.
ముఖ్యంగా వెజిటబుల్ రంగులతో తయారు చేసినటువంటి ఈ కలంకారీ దుస్తులకు యూరప్ లో అత్యధికమైన డిమాండ్ ఉంది. దీనిని గమనించి భారత ప్రభుత్వం వారు 40 లక్షల రూపాయలను కామన్ ఫెసిలిటీ సెంటర్ స్థాపించటానికి (మచిలీపట్నంలో లేదా పెడన న లో) నిధులను మంజూరు చేయడం జరిగింది ఒక సంవత్సరము క్రితం.
కానీ తగిన స్థలం చూపించక పోవడం వలన ఈ నిధులను వాడుకోలేక పోతున్నాము.
దీనిని 1927వ సంవత్సరంలో మసుల కలంకారి అభివృద్ధికి స్థాపించారు. విన్నకోట వెంకటస్వామి నాయుడు గారు 1939 నుండి దీని కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. అనేకమంది కలంకారి వారికి బాసటగా నిలిచారు. క్రమేపి గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ సొసైటీ మూలన పడి పోయింది. 20 సెంట్ల భూమి ఈ సొసైటీ కింద ఉంది. ఇది హ్యాండ్లూమ్ డిపార్ట్ మెంట్ కింద ఉందట. కనుక ఈ సొసైటీని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇక్కడ పెట్టినట్లయితే కలంకారీ కి చాలా ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. డిస్ట్రిక్ట్ హెడ్ కోటర్స్ లో ఈ సెంటర్ ఉండటం వలన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వారు కూడా వారి స్టాఫ్ ను నియమించడానికి అవకాశం ఉంటుంది. ఈ సెంటర్లో అందరి యొక్క వస్తువులను ప్రదర్శించి నట్లయితే ఎక్స్ పోర్టర్ లు ఇక్కడికే వచ్చి డైరెక్ట్ గా ఆర్డర్లు ఇవ్వటానికి అవకాశాలు పెరుగుతాయి.
కనుక సాధ్యమైనంత త్వరలో ఇక్కడ , లేకుంటే వేరే గవర్నమెంట్ స్థలంలోనైనా CFC మొదలు పెట్టే విధంగా సహాయం చేసి, కలంకారి వారందరికీ మంచి ప్రోత్సాహం ఇవ్వాలి.