తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తన అన్న కుమారుడు రామ్ చరణ్ కు ఆయన ఒక సూచన చేశారు. తుపాను వల్ల దెబ్బతిన్న ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని బాగుచేయమని చెప్పారు. బాబాయ్ సలహా మేరకు అబ్బాయ్ వెంటనే కార్యరంగంలోకి దిగిపోయాడు. తన సేవలు ఏ గ్రామానికి ఉపయోగకరంగా ఉంటాయో... ఆ గ్రామాన్ని గుర్తించమని తన టీమ్ కు చరణ్ చెప్పాడు.