- కేంద్ర మంత్రి జేపీ నడ్డాని తెలంగాణ వైద్య మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణకు ఎయిమ్స్ సహా, రాష్ట్రానికి మరిన్ని నిధుల కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఢిల్లీలోని పార్లమెంట్ హౌజ్‌లో కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాని తెలంగాణ వైద్య ఆరోగ్య కుటంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి కలిశారు. కల్తీ కంట్రోల్ కోసం మరిన్ని నిధులు, మోబైల్ వాహనాలు కావాలని మంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని వివరించారు. రాష్ట్రానికి మరిన్ని నిధులు కావాలని, ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ వేణుగోపాల చారి, లోక్‌సభలో టిఆర్ఎస్ నేత ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎంపీలు నగేశ్, సీతారాం నాయక్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.