టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో శతకం సాధించాడు. వన్డేల్లో అతడికిది 36వ శతకం కావడం ప్రత్యేకం. సచిన్ 49 శతకాల తర్వాతి స్థానం విరాట్‌దే. విండీస్ నిర్దేశించిన 323 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా 42.1 ఓవర్లలోనే ఊదేసింది. తద్వారా 5వన్డేల సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది.