కృష్ణాజిల్లా కోడూరు మండలం లోని హంసలదీవి బీచ్ కు వైజాగ్ రామకృష్ణ బీచ్ కి ఉన్నంత పొటెన్షియల్ ఉంది. ఇక్కడ కృష్ణానది సముద్రంలో కలుస్తుంది. దీనినే సాగర సంగమం అంటారు. ఈ ప్రాంతం కృష్ణ అభయారణ్యంలోఉంది. బీచ్ అభివృద్ధి పనులు ఏమీ జరగడం లేదు. మన కొత్త రాజధాని వారందరకు మంచి వీకెండ్ ఎస్కేప్ అవుతుంది. అనేకమంది విదేశీ పర్యాటకులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వారాంతంలో చాలా మంది సందర్శకులు వస్తున్నారు కానీ బీచ్లో ఎలాంటి సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మహిళలు. ఇప్పుడు మచిలీపట్నం ప్రాంతం కూడా భవానిపురం ఉల్లిపాలెం బ్రిడ్జి కృష్ణానదిపై రావడం ద్వారా హంసలదీవి రావటానికి చాలా దగ్గరవుతుంది. అందువలన రాబోవుకాలంలో ఈ బీచ్ కి వచ్చే వారి సంఖ్య మరింత పెరగనుంది. టూరిజం డిపార్ట్మెంట్ వారు బీచ్ ఫెసిలిటీస్ అభివృద్ధి చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఒక్కసారి అధికారులు హంసలదీవి బీచ్ కి సందర్శించి బీచ్ ఫెసిలిటీస్ అభివృద్ధి చేయటానికి తగు సహాయం చేయాలి.