సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు మంచు మనోజ్. తాజాగా అయన సోషల్ మీడియాలో ఆయన ఓ లేఖను విడుదల చేయడం, అందులోని వ్యాఖ్యలను చూడటంతో, మనోజ్ మనసులో రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు. సినిమాలే తనకు ప్రపంచం కాదని, ప్రజలకు చేతనైన సాయం చేయాలని ఉందని, తనకెంతో ఇష్టమైన తిరుపతి నుంచే ప్రయాణం ప్రారంభమవుతుందని చెబుతూ ఓ లేఖను ఆయన పోస్ట్ చేశాడు.