కోస్తా జిల్లాల్లో మూడు రోజుల నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాలోని అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా మూడు నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, తునిలో సోమవారం 35 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకినాడ, గన్నవరం, కావలిలో 34 డిగ్రీలు, కళింగపట్నం, బాపట్ల, మచిలీపట్నంలలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.మరో వైపు అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అక్కడే స్థిరంగా ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఏపీపై ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలిపారు.