తన తండ్రిపై ఆరోపణలు చేసిన నటి శృతి హరహరణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అర్జున్ కుమార్తె ఐశ్వర్య. ‘నిబునన్’ సినిమా చిత్రీకరణ సమయంలో అర్జున్ తన పట్ల అసభ్యకరంగా వ్యవహరించారని, సినిమాను ఆపడం ఎందుకని ఆ సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించలేదని శృతి ఇటీవల ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే శృతి చేస్తున్న ఆరోపణలపై అర్జున్ కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఐశ్వర్య తన తండ్రిపై వస్తున్న ఆరోపణల గురించి మీడియా ద్వారా స్పందించారు. నిబునన్’ సినిమా స్క్రిప్ట్‌లో ఒకటి రెండు చోట్ల ఇబ్బందికర సన్నివేశాలు ఉన్నాయి. అప్పుడు నాన్న వాటిని తొలగిస్తే కానీ సినిమా చేయనని చెప్పారు. మరి ఆ సమయంలో శృతి ఎందుకు మాట్లాడలేదు. ఇన్నేళ్ల జీవితంలో మా నాన్న పబ్‌కు వెళ్లడం నేనెప్పుడూ చూడలేదు. అలాంటిది ఆమెను రిసార్ట్‌కు రమ్మంటారా? ఒక వ్యక్తికి ఇష్టంలేకుండా అతని పట్ల దురుసుగా కానీ అసభ్యకరంగా కానీ ప్రవర్తిస్తే దానిని ‘మీటూ’ అంటారు. శృతి చేస్తున్న ఆరోపణల్లో నాకు ఆ విషయం ఎక్కడా కనిపించడంలేదు. ఆమె సొంత లాభాల కోసం ఇలా చేస్తున్నారు. అందువల్లే కదా ఆమె పేరు అన్ని ఛానళ్లలో మారుమోగుతోంది. కానీ నేను మాత్రం ఆమెలా ఆలోచించలేను.’ అని ఆమె పేర్కొన్నారు.. learnmore