సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు – ప్రగతి పురోగతిపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులతో నీరు-ప్రగతి పురోగతిపై చర్చించారు. ఈ సదర్బంగా అయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనే తిత్లీ లాంటి విపత్తుల గురించి తాను హెచ్చరించానని గుర్తు చేసారు. తీరప్రాంతం కారణంగా తుపాన్లు, తరచూ కరువు పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడుతున్నట్లు తాను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని అయన ఆరోపించారు. కేంద్రం మాత్రం ఉద్దేశపూర్వకంగానే సాయం చేయడం లేదని విమర్శించారు. పట్టుదలతో తమకున్న వనరులతో విపత్తులను అధిగమిస్తున్నామని అన్నారు. ఫలితాలను సాధిస్తున్నామని అన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదని చంద్రబాబు అన్నారు.