వైకాపా అధినేత జగన్ పాదయాత్రలో పూర్తిగా అసత్యాలు మాట్లాడుతూ పాదయాత్రచేస్తున్నారని రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు విమర్శించారు. సోమవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఓ ప్రతిపక్ష నేత గా వ్యవహరించడంలేదు. తిత్లి తుపాన్ తో విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులు నష్ట పోయినా పాదయాత్ర చేసుకుంటున్నారు గాని ప్రజలకు కలిసి అండగా నిలబడకపోవడం దురదృష్టకరమని అన్నారు. సీం చంద్రబాబు తుపాను ముందురోజునుండి రాత్రిపగలు కష్టపడుతున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుని ప్రజలకు అండగా నిలిస్తే జగన్ ను గుర్తిస్తారుకాని అసత్యలు మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరని అన్నారు. పసుపు కుంకుమల ద్వారా మహిళలకు సహాయం చేస్తుంటే అవాస్తవాలు మాట్లాడుతున్నారు. విజయనగరం జిల్లాలో 4 లక్షలమంది మహిళలకు పసుపుకుంకుమ పథకం అందింది. ఇది జగన్ కి నిరూపించడానికి మేం సిద్దం. అవాస్తవమని జగన్ నిరూపించగలరా అని ప్రశ్నించారు. మీ కుటుంబ సబ్యలే గతంలో కడప లోని బైరటీస్ ని అక్రమంగా దోచుకున్నారు. అక్రమ మైనింగ్, ఇసుక తవ్విన బోత్స కుటుంబం మీతోనే ఉంది. బోబ్బిలి యుద్దం మాకు విజయనగరం రాజులకి జరిగిన, జిల్లా అబివృద్ది కోసం మంచికి మారుపేరైన అశోక్ గజపతిరాజుతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్న మిమ్మల్ని గ్రామీణ ప్రజలు నమ్మరని అన్నారు.