YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టు ప్రగతిపై సిఎస్ సమీక్ష

 విశాఖపట్నం మెట్రోరైలు ప్రాజెక్టు ప్రగతిపై సిఎస్ సమీక్ష
విశాఖపట్నంలో చేపట్టనున్న మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ సమీక్షించారు.ఈమేరకు సోమవారం అమరావతి సచివాలయంలో విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో ఆయన సమీక్షిస్తూ ఆప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుతం దాని పురోగతి ఏవిధంగా ఉంది అధికారులను అడిగి తెల్సుకున్నారు.ప్రస్తుతం దేశంలోను, ప్రపంచంలోను ఎక్కడెక్కడ మీడియం మెట్రోరైలు ప్రాజెక్టులు,లైట్ మెట్రో రైలు ప్రాజెక్టులు ఉన్నాయనే దానిపై ఆరా తీసారు.అలాగే విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుపై కూడా సిఎస్ ఆరా తీసి దానికి సంబంధించిన అంశాలను అడిగి తెల్సుకున్నారు.అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టు ఎండి ఎ.రామకృష్ణా రెడ్డి విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు గురించి సిఎస్ కు వివరిస్తూ సుమారు 8వేల 300 కోట్ల రూ.లు అంచనాతో 3కారిడార్ల కింద 42.55 కి.మీల పొడవున లైట్ మెట్రోగా పిపిపి తరహాలో వినూత్న పద్ధతిలో చేపట్టనున్న ఈప్రాజెక్టు దేశంలోనే రెండవ పెద్ధ ప్రాజెక్టని తెలిపారు.ఈమెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించి 5ఏజెన్సీలను షార్టు లిస్టు చేయడం జరిగిందని ఎండి రామకృష్ణా రెడ్డి సిఎస్ కు వివరించారు. అలాగే విజయవాడ లైట్ మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను కూడా ఆయన సిఎస్ కు వివరించారు.ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సిసిఎల్ఏ మన్మోహన్ సింగ్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి కరికల వలవన్,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts