నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోటలో గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి, వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్యణ్యం, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు హజరయ్యారు. కోటలో మండల వ్యవసాయ శాఖ కార్యాలయం, ఎంజేపీఏపీబీ సీడబ్ల్యూఆర్ స్కూలులో టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్, నీళ్ల ట్యాంకును ప్రారంభించడంతో పాటు మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల, డార్మిటరీ భవనాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసారు. మంత్రి మట్లాడుతూ కోటకు ఎప్పుడొచ్చినా చిన్నతనం గుర్తుకొస్తుంది. ఇరిగేషన్ మంత్రిగా దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో ఏజిల్లాలో లేని విధంగా 146 టీఎంసీల నిల్వసామర్ధ్యం కలిగిన జలాశయాలు నెల్లూరుకు ఉన్నాయంటే ఎన్టీఆర్, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పుణ్యమేనని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుగంగ పరిధిలో అటవీ అనుమతులు తెచ్చి 1.10 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చాం..మిగిలిన ఆయకట్టును కూడా సాగులోకి తెస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక జిల్లాలో ఇరిగేషన్ రంగంలో అనూహ్యమైన మార్పులు తెచ్చి రైతులకు ఎన్నో ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చాం. పొదలకూరు మండల ప్రజల ఓట్లతో రాజకీయాలు చేస్తున్న వారు ఆ ప్రాంతాన్ని బీడుగా మిగిల్చారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల అందుబాటులోకి తేవడంతో పాటు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సోమశిల దక్షిణ కాలువ నీళ్లు పొదలకూరు మండలానికి తీసుకొచ్చాం. మరో వైపు కాలువ పనులు పూర్తి చేస్తున్నాం. ఎమ్మెల్యే సునీల్ గూడూరు నియోజకవర్గంలో రూ.2,154 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రగతిలో శ్రీనివాసులు రెడ్డి వారసుడు అనిపించుకున్నాడని అన్నారు. టీడీపీ హయాంలో ఎవరూ ఊహించనిరీతిలో అభివృద్ధి జరుగుతోంది. ఎవరూ అడగకుండానే సీఎం చంద్రబాబు నాయుడు చంద్రన్న పెళ్లికానుక, చంద్రన్న బీమా వంటి ఎన్నో పథకాలు అమలుచేసి పేదలకు అన్ని విధాల అండగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం కన్నా ఎక్కువ ఇన్ పుట్ సబ్సిడీ ప్రకటించారని గుర్తు చేసారు. వ్యవసాయం అంటే అర్ధం తెలియని వారు, సినిమాలు తప్ప ప్రజాసమస్యలు తెలియని వారు నోటికొచ్చినట్టు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.